వినాయక నిమజ్జనాలను పర్యవేక్షించిన మల్టీజోన్-II, ఐజీ వి.సత్యనారాయణ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనాలను మల్టీజోన్-II, ఐజీ వి.సత్యనారాయణ సందర్శించి, అక్కడి ఏర్పాటులను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ వినాయక నిమజ్జనాల దృష్ట్యా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల భధ్రత పరమైన ఏర్పాట్లను చేసినట్లు వివరిస్తూ.. డ్రోన్ కెమెరా ద్వారా మహబూబ్ సాగర్ చెరువు వద్ద భధ్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన బందోబస్తును, గణనాథుని శోభా యాత్ర, ట్రాఫిక్ నియంత్రణ గురించి వివరించారు. అనంతరం ఐజీ విలేకరులతో మాట్లాడుతూ.. గణనాథుని శోభాయాత్రను వీక్షించడానికి వచ్చే భక్తులకు, వాహణదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 1200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు ఐజీ పేర్కొన్నారు. ఈ బందోబస్తు రేపు ఉదయం అన్ని వినాయకుల నిమజ్జనం వరకు కొనసాగుతుందన్నారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించవలసిందిగా సూచించారు.

Join WhatsApp

Join Now