బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాదిరి పృథ్విరాజ్

IMG 20240729 WA0219

సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): బోనాల పండుగ సందర్బంగా అమ్మవారిని ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్, బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి పృథ్విరాజ్ దర్శించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పటాన్ చెరు పట్టణంలో బోనాల ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఎం డీ ఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్, బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి పృథ్విరాజ్ పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న బోనాల పండుగను ప్రజలంతా భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆయన అమ్మవార్లకు మొక్కుకున్నారు. జీఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో అమ్మవారి ఫలాహారం బండి, బండ్లగూడ గ్రామంలో తొట్టెల ఉరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now