వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి శాకాంబరీగా అలంకరణ

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆషాడ మాసం చివరి మంగళవారం పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి శాకాంబరిగా అలంకరణ చేశారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించారు. దేవాలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంతకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భగలాముఖిదేవి ఉపాసకుడు క్రాంతి పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజు, కోశాధికారి మల్లేశం, ఉపాధ్యక్షుడు రాధా కిషన్, కార్యనిర్వాహక కార్యదర్శి విద్యాసాగర్, మహిళా సభ్యులు తోపాజీ తేజవతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now