ఏపీలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ..
దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీ పొడిగింపు
ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
ఈ నెల 14వ తేదీన లాటరీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు..
ఈ నెల 16 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం..
ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 11వరకు అప్లికేషన్ల స్వీకరణకు గడువు పొడిగించింది.నిన్న రా.9 గంటల వరకు 41,348 అప్లికేషన్లు రాగా ప్రభుత్వానికి రూ.826.96 కోట్ల ఆదాయం వచ్చింది.ఈ నెల 14న ప్రభుత్వం లాటరీలో లైసెన్సులు సెలక్ట్ చేయనుంది. 16 నుంచి కొత్త లైసెన్స్ దారులు దుకాణాలు ప్రారంభించుకోవచ్చని తెలిపింది. అదే రోజు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది.