రేపు కందుకూరు లో జరిగే సీఎం సభ స్థలాన్ని పరిశీలిన

ప్రశ్న ఆయుధం న్యూస్ రంగారెడ్డి జిల్లా (జులై-31):

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామం లో నెట్ జీరో సిటీని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ని. మిర్ఖన్ పేట్ రెవెన్యూ పరిధిలో రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతులమీదుగా శంకుస్థాపన చేసే కార్యక్రమం, మీటింగ్ సభ ప్రాంగణాన్ని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, తెలంగాణ ముదిరాజ్ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ జిల్లా చైర్మన్ తీగల అనిత రెడ్డి, కందుకూరు డివిజన్ ఆర్డివో, తహసీల్దార్ కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ జెడ్పీటీసీ లు, మాజీఎంపీటీసీ లు, మాజీ సర్పంచ్ లు,మాజీ వైస్ ఎంపిపి శమంతా ప్రభాకర్ రెడ్డి, మండల్ కో ఆర్డినేటర్ మొహమ్మద్ అఫ్జాల్ బేగ్, సీనియర్ నాయకులు డిల్లి శ్రీధర్ ముదిరాజ్, సరికొండ పాండు, కంబాలపల్లి విష్ణు వర్ధన్ రెడ్డి, K.మదన్ పాల్ రెడ్డి, కత్తుల వెంకటేష్,డిల్లి కృష్ణ, గంగరి దర్శన్, ఈర్లపల్లి శ్రీకాంత్ రెడ్డి, అండెకర్ జగదీశ్, గండికోట యాదయ్య, దేవేందర్, ప్రశాంత్ కుమార్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now