సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సామాజిక సేవా రత్న అవార్డును తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ అందుకున్నారు. హైదరాబాదు హిమాయత్ నగర్ లో సోషల్ వర్కర్ ఆలూరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజర్ అధ్యక్షుడు డాక్టర్ అల్లూరి విల్సన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా రత్న అవార్డును తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 10 సంవత్సరాల కాలంలో పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు అవార్డు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.