మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని ఆర్డీవోకు వినతి

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని కోరుతూ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డికి నర్సాపూర్ డివిజన్ ఉద్యోగ, ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు. శనివారం నాడు నర్సాపూర్ లోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డికి మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రసన్న కుమార్, వివిధ ఉద్యోగ సంఘ నాయకులు సహాదేవ్, మహేశకుమార్, నాగరాజు, స్వామి, మృనాలిని, కవిత, దీపిక, ఉద్యోగులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now