సంగారెడ్డి పట్టణానికి విచ్చేసిన నీలం మధును సన్మానించిన పులిమామిడి రాజు

సంగారెడ్డి
Headlines (Telugu)
  1. సంగారెడ్డి పట్టణంలో నీలం మధును ఘనసన్మానం
  2. ఇంటింటి సర్వేలో ముదిరాజ్ కులం వివరాలు నమోదు చేయాలని పులిమామిడి రాజు విజ్ఞప్తి
  3. సీఎం రేవంత్ రెడ్డికి బీసీ కులగణన కార్యక్రమం నిర్వహించినందుకు కృతజ్ఞతలు

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ను కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు, వారి కుల బంధువులతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ.. నవంబరు 6వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఇంటింటి సర్వేకు మన ప్రభుత్వం 56 కాలమ్స్ నకు సంబంధించిన వివరాలను పొందుపరిచిందని, వాటికి కచ్చితంగా మనమందరం సమాధానం ఇస్తూ.. సర్వేను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ముఖ్య విషయ ఏమంటే ముదిరాజ్ బంధువులందరూ తమ పేరు పక్కన ముదిరాజ్ అని వివరంగా రాయించాలని , అప్పుడే మన రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్య కచ్చితంగా తెలుస్తుందని పులిమామిడి రాజు విజ్ఞప్తి చేశారు. దీని ప్రకారంగానే మనకు రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో ముదిరాజులకు రిజర్వేషన్ లభిస్తుందని తెలియపరిచారు. కావున ప్రతి ఒక్కరూ ఇట్టి సర్వేకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం బీసీ కులగణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మరియు సదాశివపేటకు సంబంధించిన ముదిరాజులు మాజీ కౌన్సిలర్ పట్నం సుభాష్, నల్ల శంకర్, రఘు, సంగారెడ్డి ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి పిట్టల రమేష్, తిర్మల్, జనార్ధన్, కోత్లాపూర్ శ్రీనివాస్, రామ కృష్ణ, రాములు మరియు పీ.ఎం.ఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now