గౌడ కులస్తులు రాజ్యాధికారం కోసం బీసీ వర్గాలతో కలిసి ఉద్యమించాలి: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్

*గౌడ కులస్తులు రాజ్యాధికారం కోసం బీసీ వర్గాలతో కలిసి ఉద్యమించాలి:*

 *మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్*

*భోపాల్ లోని ఎల్ఎన్ సీటీ యూనివర్సిటీ ప్రాంగణంలో గౌడ జాతీయ సమ్మేళనం*

*పాల్గొన్న గౌడజన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ కమిటీ నాయకులు*

*మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ను సన్మానించిన గౌడ నాయకులు*

*దేశవ్యాప్తంగా అన్ని గౌడ సామజిక వర్గాలను కలుపుకొని వేదికను ఏర్పాటు చేస్తాం:*

*గౌడజన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ కమిటీ నాయకులు*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఎల్ఎన్ సీటీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆగస్టు 3, 4న తలపెట్టిన గౌడ జాతీయ సమ్మేళనం ముగింపు సందర్బంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని గౌడజన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో గౌడ, శెట్టి భలిజ, ఈడిగ, శ్రీశయన, కల్చూరి, నాడర్, జైస్వాల్, కళాల్, కళార్, ఏజ్వ, గుప్తా, అహుల్ వాళ్య, వివిధ పేర్లతో పిలవబడే గౌడ సామజిక వర్గం ఆదివారం మా రాష్ట్రంలో మధ్యప్రదేశ్ భోపాల్ లో ఐక్యం కావడం శుభపరిమానం అని అన్నారు. గౌడ సామాజిక వర్గం అన్ని రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా 14 శాతం ఉన్నారని, గౌడ సామజిక వర్గం ఆర్థికంగా, సామజికంగా, ఎదిగి రాజ్యాధికారం కోసం బీసీ కులాలను కలుపుకొని పోరాడాలని రాజ్యాధికారం తోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. బీసీ కులాలలో గౌడ కులస్తులు, యాదవులు కలిస్తే రాజ్యాధికారం రావడం ఖాయమని అన్నారు. అనంతరం గౌడ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అన్ని గౌడ సామజిక వర్గాలను కలుపుకొని ఒక్క వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జైనారాయణ్ చౌకశే, ఎం ఎన్ రాయి, భోపాల్ నగర మేయర్ మాలతి, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్ధి రాములు గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజ్ గౌడ్, జాతీయ కోశాధికారి ఏవీ.బాలేషంగౌడ్, జాతీయ అధికార ప్రతినిధి బాలసాని సురేష్ గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు ముత్యం నర్సింలుగౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు పచ్చిమడ్ల స్వామి గౌడ్, కొండగొని రవీందర్ గౌడ్, మంద రామారావు గౌడ్ లతో పాటు 22 రాష్ట్రాల గౌడ ప్రతినిధులు, మహిళలు, మేధావులు, పాల్గొన్నారు. 

Join WhatsApp

Join Now