పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం: జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం అని, జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న హోమ్ గార్డ్స్ కు వీక్లీ పేరేడ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న హోమ్ గార్డ్స్ కు దర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోమ్ గార్డ్స్ కు పేరేడ్ నిర్వహించి, డ్రిల్ చెక్ చేశారు. రోజు వ్యాయామం ఆరోగ్యానికి శ్రేయస్కరమని, సిబ్బంది, అధికారులు ప్రతి రోజు వ్యాయామం చేయాలన్నారు. శారీరకంగా శక్తి సామర్థ్యాలతో ఉన్నప్పుడే ఎలాంటి విధులనైనా ధైర్యంగా నిర్వహించగలమని, ప్రతి రోజు వ్యాయామం చేస్తూ.. శారీరకంగా ఫిట్ గా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి, తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. అనంతరం ఎస్పీ రూపేష్ సిబ్బందితో మాట్లాడుతూ.. వ్యక్తిగత లేదా డ్యూటీ పరంగా ఎలాంటి సమస్యలున్న అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా జిల్లా పోలీసు శాఖ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలను అందించడం జరుగుతుందన్నారు. ప్రత్యేక అర్హతలున్న సిబ్బంది ముందుకు రావాలని, వారి అర్హత, ప్రతిభ ఆధారంగా డ్యూటీలను వినిపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, ఆర్మూడ్ రిజర్వ్ డియస్పి నరేందర్, ఆర్.ఐ.లు రాజశేఖర్ రెడ్డి, డానియెల్, ఆర్.ఎస్ఐలు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment