*మాజీ సర్పంచ్ రాజిరెడ్డిని పరామర్శించిన కాటా శ్రీనివాస్ గౌడ్*

*మాజీ సర్పంచ్ రాజిరెడ్డిని పరామర్శించిన కాటా శ్రీనివాస్ గౌడ్*

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలోని పట్నం హైవే రెస్టారెంట్ కు భోజనానికి వెళ్లిన లక్డారం మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, సోదరులకు అక్కడి రెస్టారెంట్ నిర్వాహకులకు జరిగిన చిన్నపాటి వాగ్వాదంలో రెస్టారెంట్ నిర్వాహకులు వారిని తీవ్రంగా గాయపడేలా కొట్టడంతో ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్లి తగాదాను ఆపడానికి ప్రయత్నించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డిని కూడా రెస్టారెంట్ నిర్వాహకులు తీవ్రంగా గాయపడేలా కొట్టారు. రాజిరెడ్డి, సోదరులను బీరంగూడ పానాసియా మెరిడియన్ ఆసుపత్రికి తరలించగా, విషయం తెలుసుకున్న పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ వారిని పరామర్శించారు. ఈ విషయంపై పటాన్ చెరు పోలీసు అధికారులతో మాట్లాడి తక్షణమే రెస్టారెంట్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కాటా శ్రీనివాస్ గౌడ్ కోరారు.

Join WhatsApp

Join Now