తెలంగాణ సదాశివపేటలో శ్రీ మహంకాళి బోనాల మహోత్సవంలో పాల్గొన్న పులిమామిడి రాజు by Donthi Mahesh Updated On: July 21, 2024 1:47 pm సంగారెడ్డి ప్రతినిధి, జూలై 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా శ్రీ మహంకాళీ మాతకు ఉదయాన్నే కాంగ్రెస్ నాయకులు పులిమామిడి మమత, రాజు దంపతుల తరపున ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పించి, ఓడి బియ్యాన్ని సమర్పించారు. మహంకాళీ మాతకు ప్రతి సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం పులిమామిడి రాజు దంపతులు 2.5 తులాల (లక్ష తొంబై వేల విలువగల) బంగారు ఆభరణాన్ని అమ్మవారికి సమర్పించారు. తదుపరి బోనాల ఊరేగింపు కార్యక్రమం ఆలయ ప్రాంగణం నుండి దుర్గాభవాని మందిరం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి రాజు హాజరయ్యారు. ఈ ఉత్సవాలలో అమ్మవారి వేషధారణలు, చిన్నారుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు భక్తులను అలరించాయి. అనంతరం పులిమామిడి రాజు మాట్లాడుతూ..సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, చక్కని పాడి పంటలతో తులతూగెట్టాటూ ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నల్ల సుధాకర్, చాపల హనుమంతు, శంకర్, బంటు రవి, చాపల రవి, చిన్న, మనోహర్, రాజు, సాయి కిరణ్, అఖిల్, మనోజ్, వినోద్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. Post Views: 69