ఉపాధ్యాయుడు రామకృష్ణకు సత్కారం

సత్కారం

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): కమ్మ సంఘం ఆధ్వర్యంలో 28వ కార్తీక మాస వన భోజన మహోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని మియాపూర్ నరేన్ గార్డెన్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీ.ఏ.సీ. చైర్మన్ అరెకపూడి గాంధీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యా, సామాజిక రంగాలలో విశేష కృషి చేస్తున్న సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నిజాంపూర్ (కె) పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా.పొట్రు రామకృష్ణను కమ్మ సంఘం తరుపున ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రమౌళి, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఘట్టమనేని. బాబురావు, టెక్నాలజీ సర్వీసెస్ తెలంగాణ చైర్మన్ మన్నె సతీష్ కుమార్, ప్రముఖ కార్డియాలజిస్ట్ కోగంటి సుధీర్, ప్రముఖ వ్యాపారవేత్త పర్వతనేని గంగాధర్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, పారిశ్రామికవేత్త ఆవుల గోపాలరావు, బండి రమేష్, మువ్వ సత్యనారాయణ, మాదినేని సీతారామయ్య, పురకొండ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now