*జయశంకర్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలి:* *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి*

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ జాతి పితామహా స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం బీరంగూడలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల శాఖ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రామచంద్రాపురం మండల శాఖ అసోసియెట్ అధ్యక్షుడు టి. నాగభూషణం ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ జాతి పితామహా స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండం మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మండల శాఖ ప్రధాన -కార్యదర్శి సి.యెచ్చు.రాములు,ఆర్థిక కార్యదర్శి జి.బస్వరాజు, ఆర్గనైజిoగ్ కార్యదర్శి టి.ప్రతాపరెడ్డి, యం.మధుసూధన శర్మ, కే.రామచందర్ రావు, రాఘవేంద్ర చారి, రామకృష్ణ రాజు, మాణిక్ రావు, గోపాల్, శ్రీనివాస్ రావు, కే.నర్సింహులు, నాగేశ్వర్ గుప్తా, ఆర్.ప్రకాష్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు పి.శంకర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమావేశ అధ్యక్షుడు టి.నాగభూషణం మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం దీర్ఘకాలిక పోరాటం చేసిన మహా యోధుడు స్వర్గీయ ఆచార్య జయ శంకర్ అని నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం తీసిన సందర్భాలు గుర్తు చేశారు. స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వివిధ రూపాల్లో నిరంతరం పోరాటాలు చేసిన తెలంగాణ జాతి పితా స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ సార్ అని, పాఠశాల స్థాయిలోనే ధిక్కార స్వరం వినిపించిన యోధుడు అని ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. ఇడ్లీ సాంబారు గో బ్యాక్, గైర్ ముల్కి గో బ్యాక్ ఉద్యమాలలోనూ క్రియాశీలమైన పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాలకు ఊపిరి పోయడానికి, ప్రజలను చైతన్యం చేసేందుకు వివిధ రకాల సంఘాల నిర్మాణoలోను క్రియాశిలమైన పాత్ర పోషించారని తెలిపారు. ఆజన్మ బ్రహ్మాచారిగా ఉంటూ తన జీవితాన్నె ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కోసం అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. పాఠశాల ఉపాధ్యాయుని స్థాయినుంచి విశ్వవిద్యాలయం ఉప కులపతి స్థాయివరకు విద్యారంగ పరిపుష్టి కోసం కూడా నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ సార్ అని, ఆయన జన్మదినంను తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం సముచితంగా ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ సార్ పేరు చరిత్రలో నిలిచి ఉంటుంది అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించేవాడని, సమ న్యాయం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేసిన మహా యోధుడు జయశంకర్ సార్ అని ఆయన చూపిన పోరాట పటిమను గుర్తు చేశారు. ఆంధ్ర పెత్తనంపై అలుపులేని పోరాటం చేసిన వ్యక్తి జయ శంకర సార్ అని ఆయన సేవలకు కొనియాడారు. జయ శంకర్ సర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మండల శాఖ ఆధ్వర్యంలో కనీసం ఐదుగురు ఉపాధ్యాయులకు సన్మానం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొని ఆచార్య జయ శంకర్ సార్ విద్యారంగానికి చేసిన సేవలను జాతికి అంకితం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల శాఖ ప్రధాన కార్యదర్శి సి.హెచ్.రాములు స్వాగత వచనములు పలుకగా, ఆర్థిక కార్యదర్శి జి.బస్వరాజు వందన సమర్పణ చేశారు.

Join WhatsApp

Join Now