పెరమ్ గ్రూప్‌కు “బెస్ట్ లేఅవుట్ డెవలపర్” అవార్డు

సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): పెరమ్ గ్రూప్ తన ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచుకుంది. అబుదాబి రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ మీట్ 2024లో “బెస్ట్ లేఅవుట్ డెవలపర్” అవార్డును అందుకోవడం ద్వారా కంపెనీ గ్లోబల్ రియల్ ఎస్టేట్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ అపురూపమైన గౌరవాన్ని పొందినందుకు సంస్థ ఛైర్మన్ హరిబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే సంస్థ డైరెక్టర్లు గ్రీష్మా, గయానీలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెరమ్ గ్రూప్ తమ వినూత్నత, అత్యుత్తమ లేఅవుట్ డిజైన్ల ద్వారా అందించిన సేవలకు ఈ అవార్డు నిదర్శనంగా నిలిచింది. అభివృద్ధి, ప్రణాళిక, స్థిరాస్తి శ్రేష్ఠతకు కట్టుబడి ఉన్న సంస్థ ఈ అవార్డుతో గ్లోబల్ స్థాయిలో తన నిబద్ధతను చాటుకుంది. అబుదాబిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు హాజరయ్యాయి. వివిధ కేటగిరీలలో ప్రతిష్ఠాత్మక అవార్డులు ప్రదానం చేయగా, పెరమ్ గ్రూప్ “బెస్ట్ లేఅవుట్ డెవలపర్” అవార్డుతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ గౌరవం సంస్థ భవిష్యత్తులో మరింత పురోగతికి పునాదిగా నిలుస్తుందని, రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మరింత ముందుకు కొనసాగుతుందనే నమ్మకం యాజమాన్యం వ్యక్తం చేసింది.

Join WhatsApp

Join Now