కంప్యూటర్ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

కంప్యూటర్ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

సిఐటియులో చేరిన కంప్యూటర్ ఆపరేటర్లు

సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మరాఠీ కృష్ణమూర్తి 

జగదేవపూర్ నవంబర్ 27 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మరాటి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్లను సీఐటీయూలోకి ఆహ్వానించి సభ్యత్వం తీసుకున్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మరాటి కృష్ణమూర్తి మాట్లాడుతూ కంప్యూటర్ ఆపరేటర్లకు జిపి ల నుండి రొటేషన్ పద్ధతిలో జీతాలు చెల్లిస్తున్నారని అలాకాకుండా ట్రెజరీ నుంచి నేరుగా కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరికి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని మహిళలకు మెటర్ని లీవులు మంజూరు చేయాలని అన్నారు. పది సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరిని పర్మినెంట్ చేయలేదని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రజా ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్లను ఉద్యోగ భద్రత కల్పించి వీరిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు గజ్వేల్ డివిజన్ నాయకులు పొట్టోల్ల దాసు, కంప్యూటర్ ఆపరేటర్లు ఎం లక్ష్మి, సిహెచ్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now