..మానవత్వాన్ని చాటుకున్న నర్మాల మాజి సర్పంచ్ ఏడబోయిన రాజు..
గంభీరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఏడబోయిన రాజు మానవత్వాన్ని చాటుకున్నారు. దుబ్బాక మాచారెడ్డి ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదంలో దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామానికి చెందిన సాయి రోడ్డు ప్రమాదంలో బుధవారం రోజున గాయపడగా స్థానికులు నర్మాల మాజీ సర్పంచ్ రాజుకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించి 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి వెంటనే దుబ్బాక ఏరియా హాస్పిటల్ కు క్షతగాత్రుని తరలించారు. వీరి వెంట నర్మాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఓరగంటి నర్సింలు గుండెల్లి రాజనర్సు వల్లెపు అనిల్ గోగుల రాజు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.