*నర్సాపూర్ లో పెద్ద కాలువను శుభ్రం చేయించిన చైర్మన్ అశోక్ గౌడ్*

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వచ్ఛదనము – పచ్చదనము కార్యక్రమంలో భాగంగా బుధవారం నర్సాపూర్ పురపాలక సంఘం పరిధిలోని 7వ వార్డులో చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ ఆద్వర్యంలో పెద్ద కాలువను జేసీబీ సాయంతో శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీ జైత్ రామ్ నాయక్, వైస్ పర్సన్ ఎండి. నయీముద్దీన్, కౌన్సిలర్లు గొల్ల రుక్కమ్మ, పంబాల రామచందర్, పట్టణ అధ్యక్షుడు పంబాల బిక్షపతి, పురపాలిక వార్డు అధికారులు, శానిటేషన్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, మెప్మ ఆర్ పీలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now