*జహీరాబాద్ లో విచ్చవిడిగా ఎర్ర రాయి మాఫియా*

*జహీరాబాద్ లో విచ్చవిడిగా ఎర్ర రాయి మాఫియా*

*బహిరంగ ప్రదేశంలో వాహనాలు పెట్టి ఎర్రరాయి అమ్మకాలు*

*మౌనం పాటిస్తున్న సంబంధించిన అధికారులు*

జహీరాబాద్, ఆగస్టు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో వివిధ గ్రామాల నుంచి విచ్చవిడిగా ఎర్రరాయి కోసి జహీరాబాద్ కు తరలిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా.. అధికారులు పూర్తిస్థాయిలో మౌనం పాటించడంతో ఎర్రరాయి మాఫియాకు మరింత బలం చేకూర్చున్నట్టు అయితుంది. రోజురోజుకు పెరుగుతున్న ఎర్రరాయి మాఫియా మండలాలలో అనేక గ్రామాలలో నుంచి అడవి మరియు ప్రభుత్వ భూములలో ఉన్న ఎర్రరాయిని కోసి జహీరాబాద్ కు తరలిస్తూ పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం అధికార యంత్రంగాన్ని తెలిసినా కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఎర్రరాయి కోసి అమ్ముతున్న మాఫియాకు మరింత బలం చేకూర్చినట్టు అవుతుంది. ఇది ఇలానే కొనసాగిస్తే రాబోయే రోజులలో ప్రభుత్వ మరియు అడవి భూములలో పెద్దపెద్ద గుంతలు సొరంగాలు మాత్రమే కనిపిస్తాయి. కావున దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ మాఫియాని అరికట్టాలని జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now