*మాలల సింహ గర్జనకు అధిక సంఖ్యలో తరలి రండి*
హైదరాబాద్ లో డిసెంబర్ ఒకటో తేదీన నిర్వహించే మాలల సింహగర్జన సమావేశాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆదేశాల మేరకు, మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో మాలల సింహగర్జన గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హలో మాల-చలో హైదరాబాద్ మాలల సింహ గర్జన డిసెంబర్ 1న పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మాలలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాచం శ్రీనివాస్, సొల్లు బాలయ్య, ఎర్రల రవి, ఎర్రల రాజు, బొలుమల్ల సహదేవ్, దసనం శంకర్, మేడి శ్రీనివాస్, న్యాలం శ్రీనివాస్, మేడి తిరుపతి, కుట్ల తిరుపతి, గాగిల్లాపూర్ మాల సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.