*నాగుల చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న పులిమామిడి మమత రాజు*

*నాగుల చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న పులిమామిడి మమత రాజు*

సంగారెడ్డి/సదాశివపేట, ఆగస్టు 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో నెలకొల్పిన నాగదేవత విగ్రహమూర్తులకు నాగుల పంచమి సందర్భంగా వార్డు ప్రజలతో కలిసి పులిమామిడి మమత రాజు కుటుంబ సభ్యులతో పాలాభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పులిమామిడి మమత రాజు మాట్లాడుతూ.. నాగుల చవితి పండుగ జరుపుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నాయని, పెళ్లై పిల్లలున్న ఆడవారు అయితే తమ పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నాగుల చవితి జరుపుకుంటారని, పెళ్లై పిల్లలు లేని ఆడవారు తమకు సంతానం ప్రసాదించమని వేడుకుంటూ నాగుల చవితి జరుపుకుంటారనిఅన్నారు. ఇక అసలు పెళ్లి కాని అమ్మాయిలు అయితే తమకు దోషాలన్నీ పోయి పెళ్ళి జరగాలని నాగుల చవితి జరుపుకుంటారని తెలిపారు. నాగుల చవితి వెనుక దైవపరమైన కొన్ని నమ్మకాలు ఉన్నాయని, పుట్ట మన్నును తీసి చెవికి రాసుకుంటే చెవికి సంబంధించిన సమస్యలు, కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని పులిమామిడి మమత రాజు తెలిపారు. నాగుల చవితి రోజు కేవలం పుట్టను, నాగేంద్రుడిని మాత్రమే కాకుండా నాగేంద్రుడిని మెడలో ధరించే ఆ పరమేశ్వరుడిని కూడా పూజిస్తే ధన, ధాన్యాలకు లోటు ఉండదని, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని వారు తెలియజేశారు. అనంతరం సదాశివపేట ప్రజలందరికి నాగుల చవితిశుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు జయమ్మ, నాగ రాణి, లక్ష్మి, మనోజ్, రామన్న, అఖిల్, అనిత, పద్మ, మౌనిక, రాజమణి , అంజమ్మ, బాగమ్మ, శశికళ, రాణెమ్మ, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now