*ఘనంగా నాగుల పంచమి వేడుకలు*
*నాగదేవత ఆలయంలో పూజలు చేసిన బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి*
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని నాగుల పంచమి సందర్భంగా పట్టణంలోని నాగదేవత ఆలయంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంజి రెడ్డి దంపతులు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని రైతులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు సుఖ సంతోషాలతో ఆ నాగదేవత యొక్క దయతో అన్ని విధాల వారిని మంచి జరగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శికి రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్. జగన్నాథ్, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు విజేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అరుణ కవ్లాస్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బక్కయ్య గుప్తా, సహా కోశాధికారి శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్, సుదీర్ బండారి, గొల్ల భాస్కర్, సుభాష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు విశ్వనాధ్ స్వామి, వివిధ మండల అధ్యక్షులు వైద్యనాథ్, బంటు విశ్వనాథ్, నాయకులు, పూల సంతోష్, ప్రశాంత్ పాటిల్, అనిత స్వామి, పాలింకర్ సంతోష్, రమేష్ రెడ్డి, అరుణ్ ,వెంకట్, మంజుల కౌలాస్, ప్రీతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.