గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ మృతి..
నిజామాబాద్ జనవరి 10 నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సుంకర విజయ్ గుండెపోటుతో గురువారం మృతి చెందారు. గురువారం ఆయనకు రాత్రి గుండెపోటు రావడంతో నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతి పట్ల జర్నలిస్ట్ సంఘాలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాయి.