*ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య*
నిజామాద్ ఫిబ్రవరి:- ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. నవీపేట్ మండలం పోతంగల్ గ్రామానికి చెందిన రే పన్ శంకర్ (58) కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చాడు. ఎల్లమ్మ గుట్ట అమ్మ వెంచర్ లో వాచ్మెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కూతురు పెళ్లి, ఇల్లు కట్టడానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలని శంకర్ మనోవేదనకు గురయ్యేవాడు. ఈ కార్యక్రమంలో రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య నర్సు బాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.