ఎమ్మెల్యే రేవూరిని సన్మానించిన మడిపల్లి కాంగ్రెస్ నాయకులు

*ఎమ్మెల్యే రేవూరిని సన్మానించిన మడిపల్లి కాంగ్రెస్ నాయకులు*

*జమ్మికుంట ఫిబ్రవరి 21 ప్రశ్న ఆయుధం*

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ని మడిపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. శుక్రవారం జమ్మికుంట మున్సిపాలిటీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ల సమీక్ష సమావేశానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని వారు ఆయనకు తెలిపారు. కార్యకర్తలు సమిష్టిగా కృషిచేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎగ్గేటి సదానందం చిన్నవేనా రమేష్ మ్యా అశోక్ ఉప్పుల సాంబశివరెడ్డి రామిడి సూర్య తేజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment