అపార్ట్మెంట్లు కట్టేవారికి మున్సిపల్ నిబంధనలను వర్తించవా..?

అపార్ట్మెంట్లు కట్టేవారికి మున్సిపల్ నిబంధనలను వర్తించవా ?

IMG 20250222 WA0010

మున్సిపల్ అధికారులు పర్మిషన్లు ఎలా ఇస్తున్నారు..?

– విస్తుపోతున్న పట్టణ ప్రజలు.

IMG 20250222 WA00081 పట్టణ కేంద్రంలో అపార్ట్మెంట్లు హిస్టారీతిగా నిర్మాణాలు చేపడుతున్నారు. వారు మునిసిపల్ నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న మున్సిపల్ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు, ఈ అపార్ట్మెంట్లు కట్టేవరికి మున్సిపల్ నిబంధనలు పట్టావా అని పట్టణ ప్రజలు విస్తుపోతున్నారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ ర్యాంపు రోడ్డుపైకి రావడమే కాకుండా ఆ అపార్ట్మెంట్కు నిబంధనలు అనుగుణంగా లేవని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. పలువురుని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా పట్టణంలో పలుచోట్ల రోడ్డు వెడల్పు జరిగే చోట్ల సైతం మార్కింగ్ ప్లేసులో నిర్మాణాలు జరుగుతున్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు, దీనిపై సర్వాత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. కామారెడ్డి మున్సిపల్ అధికారుల తీరు ఎలా ఉంది అంటే మేము పర్మిషన్ ఇస్తాం మీరు ఎలాగైనా నిర్మించుకోండి అన్న విధంగా ఉంది.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఇలాంటి కట్టడాలపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment