క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అయిన ఎస్సీలు కూడా బీసీల కిందకే – రేవంత్ రెడ్డి..!

*క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అయిన ఎస్సీలు కూడా బీసీల కిందకే – రేవంత్ రెడ్డి*

క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అయిన ఎస్సీలు కూడా బీసీ-సి గ్రూప్ కింద ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన సర్వేలో ఎస్సీల జనాభా తగ్గిందని వస్తోన్న ఆరోపణలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కులగణన లెక్కలు పూర్తయితే, ఎవరికి ఏం రావాలో అది అడుగుతారనే భయంతోనే బీజేపి, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని అన్నారు. “ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఏ రకంగా తప్పో చెప్పండి” అని ఆయన ప్రతిపక్షాలను నిలదీశారు. ఏ బ్లాకులో, ఏ ఇంట్లో, ఏ కులాన్ని ప్రభుత్వం తప్పుగా రాసుకొచ్చిందో కులగణను తప్పుపట్టే వారు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది అంత ఆషామాషి విషయం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కులగణన గణాంకాలు పూర్తి చేస్తే… దేశచరిత్రలో తన పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీనవర్గాల లెక్క పక్కాగా తేల్చారు అని దేశమంతా రాబోయే రోజుల్లో చెప్పుకుంటుందన్నారు. తమ ప్రభుత్వం చేస్తోన్న కులగణన సర్వేకు అంతటి ప్రాధాన్యం ఉందని ఆయన చెప్పారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment