సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామంలో బోనాల ఉత్సవాలలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డిల హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఆషాడం మాసంలో రాళ్లకత్వ గ్రామం ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమ్మ వారు ప్రజలను సుఖ సంతోషలతో చూడాలని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాయికోటి రాజేష్, మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి, భార్గవ్, నరేందర్, జనార్దన్, చిట్ల సత్యనారాయణ శ్రీశైలం యాదవ్, శ్రీధర్ గౌడ్, కృష్ణ గౌడ్, సాయి భరత్, భీమ్ రావు, గణేష్, శాంతవర్మ రెడ్డి, సుధాకర్ యాదవ్, స్థానిక నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షుడు దేవేందర్, జిన్నారం యూవత అధ్యక్షులు అది రామకృష్ణ, కుమార్ యాదవ్, అంజి గౌడ్, సాని, గణేష్, రైని శ్రీను, శ్రీనివాస్ యాదవ్, పాపయ్య, నవీన్, నర్సింగ్ రావు, రాజు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
రాళ్లకత్వలో బోనాల ఉత్సవాలలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
Published On: July 22, 2024 1:49 pm