మెదక్/నర్సాపూర్, జూలై 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం కార్యాలయంలో చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ అధ్యక్షతన పట్టణంలో బోనాల పండుగ నిర్వహణ నిమిత్తం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నర్సాపూర్ లో బోనాలు తేదీ 28, 29న ఆదివారం, సోమవారం రోజున నిర్వహించుటకు గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జయత్రామ్ నాయక్, అగ్రికల్చర్ ఏఓ చంద్రవీని, పట్టణ అధ్యక్షుడు పంబాల బిక్షపతి, కౌన్సిలర్స్ సంగసాని సురేష్, ఎరుకల యాదగిరి, ఆంజనేయులు గౌడ్, బాల్ రెడ్డి, కుమ్మరి నాగేష్, ఎర్ర గొల్ల రమేష్, గ్రామ పెద్దలు దండు దశరథ, కొండి దుర్గేష్, గుండం శంకర్, కృష్ణ, సర్వేష్, నరేష్ రమేష్ యాదవ్, శానిటైజర్ ఇన్స్ పెక్టర్ సల్ల మురళి, నాయకులు పైజాన్, సైఫ్ అలీ, వార్డ్ ఆఫీసర్స్ పరశురాం రెడ్డి, ఆంజనేయులు, దుర్గేష్, రాములు, శోభారాణి, విజయలక్ష్మి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
బోనాల పండుగ నిర్వహణపై చైర్మన్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం
Published On: July 22, 2024 2:04 pm