రన్య రావు కేసులో మరో ట్విస్ట్.. ఆమె భర్తను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు..

*రన్య రావు కేసులో మరో ట్విస్ట్.. ఆమె భర్తను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు..*

బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యరావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ కేసుపై ఇప్పటికే డీఆర్‌ఐ, సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేశాయి.

రన్యరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

ఈ క్రమంలో ఆమె భర్త జతిన్ హుక్కేరికి కోర్డులో ఉపశమనం కలిగింది.

రన్యరావు కేసు విషయంలో ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి.

ఆమెకు ఎవరెవరు సహకరించారు… ?

బంగారం అక్రమ రవాణాలో ఎంత మంది ప్రమేయం ఉందని ?

పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ఆమె భర్త జతిన్ హుక్కేరి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్టు చేయవద్దని మార్చి 11న ఉత్తర్వులు జారీ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment