మొల్ల మాంబ జయంతిని విజయవంతం చేయాలి
– కుమ్మర సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ వద్ద నిర్వహించే మొల్ల మాంబ జయంతి కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి కుమ్మర్లు హాజరై విజయవంతం చేయాలని కుమ్మర్లసంఘం జిల్లా అధ్యక్షులు కుమ్మరి రాములు, డకూరి మోహన్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16 వ శతాబ్ది కాలానికి చెందిన మొల్ల మాంబ అనగారిన వర్గాలను చిన్న చూపు చూస్తున్న ఆ రోజుల్లోనే రామాయణాన్ని సులభతరంగా ఉండాలనే ఉద్దేశంతో తెలుగులో అనువదించి కుమ్మరి కులానికి ఆణిముత్యముగా నిలిచారనీ అలాంటి మొల్ల మాంబ జయంతిని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించే కార్యక్రమానికి కుమ్మరులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు.