ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

*ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు*

*విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నుల పంపిణీ చేసిన బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్*

*జమ్మికుంట మార్చి 13 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణ బి ఆర్ ఎస్ వి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒక మహిళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తనదైన శైలిలో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు కారకులుగా ఉన్న కల్వకుంట్ల కవిత జన్మదిన జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు వారికి ఎగ్జామ్ పాడ్స్ పెన్నులు స్కేలు కంపాక్స్ బాక్స్ లు పంపిణీ చేయడం జరిగిందని వారికి ఎగ్జామ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడడం జరిగిందని తెలిపారు ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉందని కల్వకుంట్ల కవిత కి జమ్మికుంట పట్టణ బిఆర్ఎస్వి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్ము నరేష్ జువాజీ అనిల్ వేల్పుల శ్రీకాంత్ చింతల కౌశిక్ పాతకాల అజయ ఓల్లాల శ్రీకాంత్ ఎండి రెహమాన్ గడ్డం సంపత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment