సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): వేసవిలో సంగారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం వాసవి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి అందజేసిన ఉచిత మంచినీటి సరఫరా ట్యాంకర్ ను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాసవి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా ఎండాకాలంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మున్సిపాలిటీకి ట్యాంకర్ ను ద్వారా ప్రతి రోజు మంచినీటి సరఫరా వాసవి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలిపారు. చలికాలంలో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు చలి నుండి కాపాడడం కోసం వాసవి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వాసవి స్వచ్ఛంద సంస్థ జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వాసవి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తోపాజి అనంత కిషన్, మున్సిపల్ కమిషనర్ ఎస్ సివికె చవాన్, వాసవి స్వచ్ఛంద సంస్థ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వాసవి స్వచ్ఛంద సంస్థ ఉచిత మంచినీటి సరఫరా ట్యాంకర్ ను ప్రారంభించిన కలెక్టర్
Updated On: March 24, 2025 6:20 pm