సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మల్లన్న దేవాలయంలో జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అన్న ప్రసాదం కార్యక్రమంలో భక్తులు పాల్గొని భోజనం స్వీకరించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం పెద్దలు గోవర్ధన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మల్లన్నస్వామి కళ్యాణంలో పాల్గొన్న చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
Published On: March 24, 2025 7:44 pm