సంగారెడ్డి/పటాన్ చెరు, ఏప్రిల్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిన్నారం మండలం మంగంపేట గ్రామంలో గురువారం తెల్లవారుజామున సీతారాముల రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ రథోత్సవంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, కొలన్ బాల్ రెడ్డి, జిన్నారం వెంకటేశంగౌడ్ తదితరులు హాజరయ్యారు. అలాగే ఉమ్మడి జిన్నారం మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భక్తులు ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీరాముడి కృపతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాయకోటి రాజేష్, దేవాలయ కమిటీ అధ్యక్షుడు గణేష్, ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు, డైరెక్టర్ మోహన్, కృష్ణ గౌడ్, శ్రీధర్ గౌడ్, అది రామకృష్ణ, శ్రీకాంత్ గౌడ్, మంగంపేట గ్రామం అధ్యక్షులు వెంకటేష్, మల్లేశం, ఖదీర్, నాగరాజు, రవి, శ్రీకాంత్, రతన్, కుమార్, నాగరాజు, నవీన్, శ్రీశైలం, బిక్షపతి, ఉమ్మడి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
