అంబేద్కర్ కు నివాళులు అర్పించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు

సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతరత్న అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు ప్రభుగౌడ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల వారికి, వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వ పథకాలు సరిగా అందడం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారులు కిష్టయ్య, కృష్ణ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి, వెంకటేశ్వర్, మెఫీ, సుధాకర్, గౌలిశ్వర్, శ్రీనివాస్, జూనియర్ అంబేద్కర్ (రక్షిత్) తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment