తప్పులు లేకుండా ఓటరు జాబితాను సరి చేయాలి: జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి ప్రతినిధి, మే 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): తప్పులు లేకుండా ఓటరు జాబితాను సరి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏఈఆర్ ఓ లు, బిఎల్ఓలతో జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ క్రాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. తప్పులు లేకుండా ఓటర్ జాబితాను తయారు చేయాలన్నారు. ఓటర్ జాబితా తప్పొప్పుల సవరణకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు. ఓటర్ జాబితా నుంచి తొలగింపునకు ఫామ్ 7, చిరునామా మార్పు, పేరులో తప్పొప్పులు లాంటివి ఫామ్ 8 లను పరిశీలించి పూర్తి చేయాలన్నారు. ఒకే కుటుంబంలో ఉండే, ఓకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వారందరికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఉండేలా ప్రణాళిక చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ఏఈఆర్ ఓలు, బిఎల్ ఓలు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now