సంగారెడ్డి/పటాన్‌చెరు, మే 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు మున్నూరు కాపు సంఘం నూతన పాలక మండలి ఏర్పాటు నేపథ్యంలో మే 4వ తేదీ (ఆదివారం) జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవం, మహాలక్ష్మి పథకం, చేయూత పథకాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని మాజీ సర్పంచ్, ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ మాదిరి దేవేందర్ రాజు, బీఆర్ఎస్ నాయకుడు ప్రిథ్వీరాజ్ లకు ఆహ్వాన పత్రికను అందజేశారు. శుక్రవారం పటాన్ చెరు ఎండీఆర్ కార్యాలయంలో ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ మాదిరి దేవేందర్ రాజు, బీఆర్ఎస్ నాయకుడు ప్రిథ్వీరాజ్ లను మర్యాదపూర్వకంగా కలిసి మున్నూరు కాపు సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనాలని పాలక మండలి సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.