మెదక్/నర్సాపూర్, మే 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రపంచంలో పాలన వ్యవస్థలు ప్రజల అవసరాల ప్రకారమే మారుతాయని ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శేషగిరిరావుగౌడ్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈడా శేషగిరిరావు పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో వివిధ దేశాల్లో రకరకాల పాలన విధానాలు ఉన్నాయని, కొన్ని దేశాల్లో రాచరిక వ్యవస్థలు కొనసాగుతుండగా, మరికొన్ని దేశాల్లో నియంతత్వ పాలన కనిపిస్తోందని తెలిపారు. అయితే ప్రజల అర్థిక, విద్యా మరియు సామాజిక స్థితిగతులపై ఆధారపడి ఆయా దేశాల్లో పాలనా విధానాలు ఏర్పడతాయని అన్నారు. ప్రజల చైతన్యం పెరిగిన కొద్దీ ప్రజాస్వామ్యానికి మద్దతు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు అంబుజ బుడ్డయ్య, ప్రధాన కార్యదర్శి రఘునాథ్ గౌడ్ మొగిలి, కోశాధికారి తల్లాడ నందకిషోర్, హైకోర్టు న్యాయవాది ధనలక్ష్మి, మెదక్ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, మైనార్టీ విభాగ అధ్యక్షుడు పసియొద్దీన్, పార్టీ నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.