సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో తొలిసారిగా సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ… జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోలు బంక్ ను నడిపించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని l, త్వరలో ప్రారంభం కానున్నదని తెలిపారు. ట్రయల్ సేల్ అనంతరం వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని పెట్రోల్ బంక్ మొట్ట మొదటిసారిగా మహిళల చేత నడిపించబడుతుందని అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ లో షెట్రోలు బంకు నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, మొత్తం 14 మంది మహిళల సిబ్బంది పని చేస్తున్నారని, అందులో ఇద్దరు మహిళలు మేనేజర్లుగా, 12 మంది మహిళలు ఆపరేటర్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పెట్రోల్ బంకు నిర్వహణ ద్వారా మహిళల కుటుంబాలు ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయన్నారు. త్వరలోనే పెట్రోల్ బంకుకు సెక్యూరిటీ నియమిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ వాహనంలో డీజిల్ పోయించుకొని తన సొంత డబ్బులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి.డి.డి ఆర్ డిఓ జ్యోతి, అదనపు డిఆర్ డిఓ జంగారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళా పెట్రోల్ బంక్ ట్రయల్ సేల్ నిర్వహణ తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్
Published On: June 9, 2025 6:26 pm
