సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని టీటీయూ జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్ అన్నారు. బుధవారం సంగారెడ్డి ఐ.బి.లో విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. రేపటి నుండి పాఠశాలు ప్రారంభం అవుతున్నా…. ఈ రోజు వరకు పాఠశాలలో మౌలిక వసతులు లేవని కనీస సౌకర్యాలు కుడా లేవని అన్నారు. ఇప్పటికి పాఠశాల్లో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం, టాయిలెట్ లు కుడా పూర్తిగా లేవని, పాఠశాలలకు బిల్డింగ్ లు కుడా సక్రమంగా లేవని తెలిపారు.. పాఠశాల అనేది విద్యార్థులను ఆకర్శించే విధంగా సర్వ హంగులతో ఉండాలే కానీ, ఎన్నో సంవత్సరాల పాత బిల్డింగ్ మాదిరిగా ఉండరాదన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలని జీవోలు తెస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందిస్తారని ప్రశ్నించారు. అలా కాకుండా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా ప్రభుత్వం సర్దుబాటు జీవోలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గల విద్యార్థుల్లో బాగా చదువుతూ, చురుకుగా ఉండే విద్యార్థులను గురుకులాలు, మోడల్ స్కూల్స్, నవోదయ, సైనిక్ స్కూల్స్, కస్తూరిబా పాఠశాల్లో పరీక్ష పెట్టి మరి అడ్మిషన్ చేసుకుంటే… ఇంకా మధ్యాస్తంగా ఉండే విద్యార్థులే కదా… మా ప్రాథమిక పాఠశాలల్లో ఉండేదని అన్నారు. అలాంటప్పుడు విద్యార్థులకు కనీస సామర్ధ్యాలు రావడం లేదని ఉపాధ్యాయులను నిందించడం ఎంత వరకు సమంజసం అని పేర్కొన్నారు.
*అంగన్ వాడీలను ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానం చేయాలి:*
*జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రవికుమార్*
అంగన్ వాడీ సెంటర్ లను ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానం చేస్తే అందులో గల విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలో చేర్చుకొనే అవకాశం ఉందని, దాని వల్ల పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంటుందని, అలా కాకుండా వారిని సపరేట్ గా ఉంచడం వల్ల అంగన్ వాడి విద్య పూర్తికాగానే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయివేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపుతున్నారని అన్నారు. కాబట్టి దీన్ని ఆపాలంటే అంగన్ వాడి కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు యం.శంకర్, బట్టు నర్సింహా రాజు, ఉపాధ్యక్షుడు రాములు, జిల్లా కార్యదర్శి జగన్ మోహన్, జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.