ఎస్సీ, ఎస్టీ కేసులు, భూముల సమస్యలు పరిష్కరించాలి: ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): జులై 30వ తేదీ వరకు ఎస్సీ, ఎస్టీ కేసులో భూముల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్వహించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధ్యక్షతన జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులతో జరిగిన సమీక్ష సమావేశానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులనుద్దేశించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పెండింగ్ కేసులు జూలై 30వ తేదీలోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి నెల అన్ని మండలాలలో పౌర హక్కుల దినోత్సవం కచ్చితంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి తహసీల్దారులు, ఎస్సైలు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. అలా హాజరుకాని అధికారులకు శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఎస్ నుండి వచ్చే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసమే వినియోగించాలన్నారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ పథకంపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఈ పథకాన్ని వినియోగించుకొని లబ్ధి పొందేల చూడాలని అధికారులకు ఆదేశించారు. సంక్షేమ హాస్టల్ లో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులు ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు ఎస్సీ ఎస్టీ లకు 41శాతం కేటాయించినందుకు జిల్లా యంత్రాంగాన్నీ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ భూ సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం రమేష్, రాంబాబు నాయక్, శంకర్, నీలాదేవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment