మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్

సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 29. (ప్రశ్న ఆయుధం న్యూస్): ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ కలిశారు. శనివారం సోమాజిగూడలోని మంత్రి నివాసంలో శ్రీనివాస్ గౌడ్ తన అనుచరులతో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిన్నారం బ్లాక్ శ్రీకాంత్ రెడ్డి, పటాన్ చెరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, జిన్నారం మండల వడ్డే కృష్ణ, గుమ్మడిదల నర్సింగ్ రావు, బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, మైనార్టీ జిల్లా నాయకుడు హబీబ్, అమీన్ పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, నాయకులు నాగేందర్ గౌడ్, శివానందం, మల్లేష్ గౌడ్, మద్ది వీరారెడ్డి, గోవర్ధన్ గౌడ్, నరేందర్ రెడ్డి, రాజిరెడ్డి, గోపాల్ యాదవ్, రాజశేఖర్, భుజంగారెడ్డి, సతీష్ గౌడ్, రవీందర్, శ్రీనివాస్, భానూరి శ్రీహరి తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment