“కేటీఆర్ భ్రమలో ఉన్నాడు – ఆంక్ష రెడ్డి కౌంటర్

రాష్ట్ర డీజీపీని కలిసిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి

మహా టీవీ న్యూస్ ఆఫీస్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల చేసిన దాడి వ్యవహారంలో యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఈ రోజు రాష్ట్ర డీజీపీని కలిశారు. దాడి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, దాడి వెనక ఉన్న కేటీఆర్ పాత్రను కూడా పరిశీలించి కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందించారు.

ఆంక్ష మాట్లాడుతూ –

“కేటీఆర్ అధికారం కోల్పోయిన బాధతో ఇలా అక్కసు తీర్చుకునే పనికిమాలిన చర్యలకు పాల్పడితే యువజన కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు. ఇలాంటి దాడులు, బలవంతపు అరాచకాలు కొనసాగితే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మనుగడ కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అందిస్తున్న పథకాలను చూసి భయపడి ఇలాంటివి చేస్తున్నారని స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్నామని భ్రమలో ఉండకుండా, ప్రజాసేవే అసలు పని అని గుర్తించాలి.”జర్నలిస్టులపై దాడులు చేయడం అమానుషం అని, అది వారి స్వేచ్ఛను హరించే చర్య అని ఆంక్ష చెప్పారు. రాష్ట్రంలో విలువలున్న రాజకీయానికి ఇది తగిన తీరుకాదని ఆమె హెచ్చరించారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment