సంగారెడ్డి ప్రతినిధి, జూలై 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): పదోన్నతి పై వెళ్తున్న డిప్యూటీ ఎస్.ఈ. (డిప్యూటీ సూపర్డెంట్ ఇంజనీర్) రాజేంద్ర ప్రసాద్ ను జిల్లా నీటి పారుదల శాఖ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. నీటి పారుదల శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన డిప్యూటీ ఎస్.ఈ. రాజేంద్ర ప్రసాద్ ను పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. ప్రసాద్ పదోన్నతి తమ శాఖకు గర్వకారణమని, ఇది ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఆయన చూపిన సమర్ధత, ప్రతిభ, దశాబ్దాలుగా చేసిన కృషికి ఇది తగిన గుర్తింపు అని అభిప్రాయపడ్డారు. రాజేంద్ర ప్రసాద్ తన ఉద్యోగ జీవితంలో నిరంతర కృషితో, నిబద్ధతతో, సేవాభావంతో ఎంతో కీర్తిని అందుకున్నారని తెలిపారు. ఆయన సమర్థవంతమైన నాయకత్వం, సమస్యల పరిష్కార శైలి, సహోద్యోగులతో సమన్వయంతో కూడిన వ్యవహారశైలి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ కూడా తనను సన్మానించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉద్యోగులన్నీ సమష్టిగా ముందుకు సాగాలన్నారు. అనంతరం జిల్లా ఉద్యోగులు రాజేంద్ర ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్.ఈ. స్థాయికి పదోన్నతి పొందిన ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించి, మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఉద్యోగ సంఘం నాయకులు, సహోద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పదోన్నతిపై వెళ్తున్న డిప్యూటీ ఎస్.ఈ రాజేంద్ర ప్రసాద్ కు సన్మానం
Published On: July 3, 2025 5:30 pm
