సంగారెడ్డి ప్రతినిధి, జూలై 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): టీజీ జేఏసీ చైర్మన్ జావీద్ అలీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా సహకార శాఖ ఉద్యోగుల సంఘం సభ్యులు జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘ ప్రతినిధులను టీజేఏసీ చైర్మన్, జిల్లా అధికారి ప్రత్యేకంగా అభినందించారు. సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షురాలు నిర్మల రాజకుమారి, కార్యదర్శి శ్రీధర్, సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని అధికారి సూచించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం, పలు సమస్యల పరిష్కార అంశాలపై చర్చించారు. జిల్లా సహకార శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల హక్కులు, సౌకర్యాలపై అధికారులు చర్చించారు. సంఘం ద్వారా ఉద్యోగుల అభివృద్ధికి కృషి చేస్తామని నూతన ప్రతినిధులు హామీ ఇచ్చారు. టీజేఏసీ చైర్మన్ జావిద్ అలీ మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాల ఐక్యతతో సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం, అధికారులు, ఉద్యోగుల వత్తిళ్లను పరిష్కరించేందుకు నిష్కృష్తంగా పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన సంఘ ప్రతినిధులకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి యాదవ్ రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షరీఫ్, సంఘ సభ్యులు, సహకార శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్ ను కలిసిన ఉద్యోగుల సంఘం సభ్యులు
Published On: July 3, 2025 6:41 pm
