ఫెరోజ్ ఖాన్‌ను కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు

సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): నాంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ ఫెరోజ్ ఖాన్‌ను మర్యాదపూర్వకంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వెంకటస్వామి, శ్రీనివాసరావు, బాలమురళికృష్ణ (చిన్న ముదిరాజ్) గురువారం కలిశారు. హైదరాబాద్ నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమైన వారు పార్టీ వ్యవహారాలపై సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా జూలై 4న ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూఐ జిల్లా వైస్ ప్రసిడెంట్ రుద్రారం సాయి, నాయకులు సంతోష్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment