*వారాహి గుప్త నవరాత్రుల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూలై 4
నాగారం మున్సిపాలిటీలోని నేతాజీ నగర్ కాలనీ పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో గుప్త నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, శుక్రవారం మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాగారం మాజీ చైర్మన్ చంద్ర రెడ్డి, మేడ్చల్ కంటెస్టెంట్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు నాగరాజు, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, బైరెడ్డి మల్లారెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మరియు మున్సిపాలిటీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.