ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలి: రైతు రక్షణ సమితి నాయకులు

మెదక్/నర్సాపూర్, జూలై 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎఫ్‌బీవై) పథకాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా పత్రాల యాదాగౌడ్, జిల్లా ముఖ్య సలహాదారులు మిర్యాల చంద్రశేఖర్ లు డిమాండ్ చేశారు. శనివారం నర్సాపూర్‌లో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల వరుసగా వర్షాభావం, విపత్కర వాతావరణ పరిస్థితులతో రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పీఎఫ్‌బీవై పథకం అమలుతో రైతులకు కొంత భరోసా లభిస్తుందని అన్నారు. ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే అమలు చేసి, రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. గతంలో రైతులకు లాభదాయకంగా నిలిచిన ఈ పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ గౌడ్, శివయ్యలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now