జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణ కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ నుండి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రిదేవి ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ‌ ర్యాలీని నిర్వహించారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రి దేవి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారని, జనాభా నియంత్రణకు ప్రస్తుతం శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులైన వాసెక్టమి, ట్యూబెక్టమీలతో పాటు తాత్కాలిక పద్ధతులను ప్రోత్సహించాలని, పురుషులు ఎటువంటి అపోహలకు లోనవ్వకుండా కోతకుట్టులేని ఎన్ఎస్ వీ ఆపరేషన్లు చేయించుకోవాలని, వివాహ వయస్సును పెంచడం, మొదటి బిడ్డ కోసం కనీసం రెండు సంవత్సరాల వ్యవధి, బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం వ్యవధి మూడు సంవత్సరాలు ఉండేట్లు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రోత్సహించాలని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చేతులమీదుగా కల్పన, అణువరీ మదిరి, గండి మీనకు క్యాష్ అవార్డులు అందుకున్నారు. జిల్లాలో బెస్ట్ మెడికల్ ఆఫీసర్ గా డాక్టర్ లక్ష్మీ శైలజ, బెస్ట్ స్టాఫ్ నర్స్ గా సరిత, బెస్ట్ ఏఎన్ఎమ్ గా విజయ్ కుమారి, బెస్ట్ ఆశా వర్కర్ గా కవిత, బెస్ట్ సూపర్వైజర్ మార్తలకు అవార్డు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ లు డాక్టర్ మనోహర్ రెడ్డి, డాక్టర్ సంధ్యారాణి, వేల్పురి రవి, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, దుర్గాబాయి దేశముఖ్ మహిళా సభ షార్ట్ టర్మ్ ఒకేషనల్ కోర్సెస్ విద్యార్థినులు, అంటేద్కర్ ఒకేషనల్ పారా మెడికల్ కోర్స్ విద్యార్థులు, అర్బన్ హెల్త్ సెంటర్స్ స్టాప్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now